అధికారంలోకి రాగానే జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: నారా లోకేశ్

  • జీఎన్ రావు నిపుణుల కమిటీ ఓ బోగస్ కమిటీ
  • రేపు అన్ని జిల్లాలకు అన్యాయం జరుగుతుంది
  • ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
రాజధాని అమరావతికి నాడు మద్దతు ఇచ్చిన జగన్, ముఖ్యమంత్రి కాగానే మాట మార్చారని, మడమ తిప్పారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళగిరిలో రైతులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లోకేశ్ పాల్గొన్నారు.

అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, జీఎన్ రావు నిపుణుల కమిటీ ఓ బోగస్ కమిటీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజున అమరావతికి జరిగే అన్యాయం రేపు అన్ని జిల్లాలకు జరుగుతుందని అన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి, పబ్బం గడుపుకోవాలనుకున్నదే జగన్ ఎత్తుగడ అని ఆరోపించారు. రైతుల ఆందోళనలను తప్పుబడుతున్న వైసీపీ నేతలు, వారి బాధలు వినేందుకు ఎందుకు రావట్లేదు? మూడు ముక్కలుగా రాష్ట్రాన్ని విడగొడితే అభివృద్ధి ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
amaravathi
Telugudesam
Nara Lokesh
jagan

More Telugu News